శివ్వంపేట, జూన్ 4 : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరులో నూతనంగా నిర్మించిన శ్రీగరుపీఠంలో శ్రీదత్తాత్రేయ మహాస్వామి, శ్రీషిర్డీసాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ట్రస్టు చైర్మన్ జిన్నారం శివకుమార్‌గౌడ్, వేద పండితులు శాస్ర్తుల వామనశర్మల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి హాజరై పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ట్రస్టు చైర్మన్ , వేద పండితులు వారిని సన్మానించారు.
అనంతరం అన్నదానం, తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ స్వరాజ్యలక్ష్మిశ్రీనివాస్గౌడ్, సీనియర్ నాయకులు యాదాగౌడ్, భిక్షపతిరెడ్డి, సంతోష్‌రెడ్డి, మర్రి మహేందర్‌రెడ్డి, కృష్ణారావు, భిక్షపతియాదవ్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.