నారాయణఖేడ్, మే 27: భూవివాదం కారణంగా చోటుచేసుకున్న ఘర్షణలో కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్ఖాన్పల్లిలో జరిగింది. నారాయణఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని 129 సర్వే నంబర్లోని రెండెకరాల భూమికి సంబంధించిన హద్దు విషయమై కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది.
ఈ క్రమంలో సోమవారం దేవీసింగ్, బాబుగొండ, తుకారాంలతో పాటు మరికొందరు కలిసి ఆ భూమిలోని చెట్లను నరికి తరలిస్తుండగా అదే గ్రామానికి చెందిన అంకం లక్ష్మయ్య(60), రాములు (65), అంకం అశోక్(40)లు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైం ది. ముగ్గురిపై కత్తులు, గొడ్డళ్లు, కట్టెలతో దాడికి పాల్పడడంతో అశోక్, రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు. అశోక్ చికిత్స పొందుతూ మృతిచెందగా, మెరుగైన వైద్యం కోసం రాములును సంగారెడ్డి సర్కారు దవాఖానకు తరలించారు. మృ తుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాచరణ్రెడి తెలిపారు.