Degree Exams | మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 16 : మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2016 నుండి 2021 వరకు విద్యనభ్యసించి ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాసుకునేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతి ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సెన్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు.
2016-17, 2017-18, 2018-19, 2019-20 విద్యా సంవత్సరాల్లో 1 నుండి 6 సెమిస్టర్లలో ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాసుకోవచ్చన్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 19వ తేదీ వరకు, అపరాధ రుసుముతో మే 29వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. 6 సెమిస్టర్లలో ఎవరైనా ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటే పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
ఈ అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుందన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాలలోని పరీక్ష విభాగం అధికారి శరత్రెడ్డిని సంప్రదించాలన్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్