చేర్యాల, జూలై 26 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులం, బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సంబంధితశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిధులు లేవనే సాకుతో వసతి గృహాల ఇన్చార్జీలు పట్టించుకోవడం లేదు.
దీంతో లక్షలాది రుపాయాలు ఖర్చుచేసి బీఆర్ఎస్ సర్కారు పంపిణీ చేసిన యంత్రాలు పాడైపోతున్నాయి. కాంగ్రెస్ సర్కారు అసలు ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేసీఆర్ రాష్ట్రంలో వేలాదిగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పి కార్పొరేట్ స్థాయి విద్య, వసతులు, భోజనం అందించారు. ప్రస్తుతం కార్పొరేట్ స్థాయి గురుకులంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని గురుకుల పాఠశా ల, కళాశాలలో 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు వసతులు ఉన్నాయి. ఈ సంవత్సరం కళాశాల, పాఠశాలలో మొత్తం 489 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. విద్యార్థులకు రోజువారీగా ఉద యం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయం త్రం స్నాక్స్, రాత్రి సమయంలో భోజనం అందించాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా భోజనం ఎక్కువ మేరకు తయారు చేయాల్సి ఉండగా నిర్వాహకులు బా యిల్డ్ స్టీమ్ యంత్రాల్లో అన్నం సకాలంలో వండి విద్యార్థులకు అందజేస్తారు.
మిగతా అల్పాహారం, స్నాక్స్, కోడిగుడ్లు తదితర వాటిని గ్యాస్ పొయ్యిలపై తయారు చేసి విద్యార్థులకు అందజేస్తారు. బాయిల్డ్ స్టీమ్ యం త్రం మరమ్మతుకు గురైంది. దీంతో గ్యాస్పొయ్యిలపైనే అన్నం వండాల్సి రావడంతో కొన్న సమయాల్లో విద్యార్థులకు సకాలంలో భోజనం అందించలేకపోతున్నట్లు తెలిసింది. విద్యార్థులకు వారంలో మెనూ ప్రకారం రెండుసార్లు కోడిగుడ్లు, అరటిపండ్లు, నాలుగుసార్లు చికెన్ కర్రీ, ఇడ్లీ, బొండా, రెండుసార్లు చపాతి, మరో రెండుసార్లు పూరీలు అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ తయారు చేసి సకాలంలో విద్యార్థులకు అందజేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గురుకులంలో విద్యార్థులకు మినరల్ వాటర్ అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ పని చేయడం లేదు. మరమ్మతు చేయాలని అధికారులకు గురుకుల నిర్వాహుకులు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులకు మినరల్ వాటర్ అందక నీటి ట్యాంకులోకి వచ్చిన మిషన్ భగీరథ నీటిని విద్యార్థులకు అందిస్తున్నారు. మినరల్ వాటర్‌కు అలవాటుపడిన పలువురు విద్యార్థులు మిషన్ భగీరథ నీళ్లు తాగేందుకు ఇబ్బందులు పడుతుండగా తప్పని పరిస్థితుల్లో మరికొందరు నీటిని తాగుతున్నట్లు తెలిసింది.
గురుకులంలోని బాయిల్డ్స్టీమ్తోపాటు మినరల్ వా టర్ ప్లాంట్ యంత్రాలకు మరమ్మతులు చేయిం చేందుకు యత్నిస్తున్నాం. యంత్రాలకు గతంలో మరమ్మతులు చేయించినప్పటికీ మళ్లీ రిపేర్‌కు వచ్చాయి. ఆర్వో ప్లాంట్‌ను త్వరగా మరమ్మతు చేయాలని కోరాం. త్వరలో మరమ్మతులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం.
– పుల్లయ్య, వైస్ ప్రిన్సిపాల్, చేర్యాల, సిద్దిపేట జిల్లా