గజ్వేల్, సెప్టెంబర్ 3: ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ విజన్‌ను చేరుకోలేరని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్కు నష్టంచేసే ప్రయత్నాలు చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని, అధికారంలోకి వస్తే తట్టుకునే శక్తిలేకనే ఇప్పుడుకుట్రలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌కు కుడి, ఎడమ భుజంగా కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నారన్నారు.
రేవంత్‌రెడ్డి, నరేంద్రమోదీ ట్రాప్‌లో ఎమ్మెల్సీ కవిత పడిందని, హరీశ్‌రావు, సంతోష్‌రావులే టార్గెట్‌గా తన వ్యక్తిగతం కోసం మాట్లాడిందన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20నెలల్లో విఫలమైందని, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో డైవర్షన్ మాటలతో పబ్బం గడుపుతున్నారని, రూ.2లక్షల కోట్లు అప్పు చేసి ఎలాంటి అభివృద్ధి చేయని సీఎంకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరంపై హరీశ్‌రావు ప్రభుత్వానికి ఇచ్చిన సమాధానంతో అర్జునుడిలా పోరాడినట్లు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ జడ్పీటీసీలు మల్లేశం, ఎల్లయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మధు, కరుణాకర్‌రెడ్డి, నునె కుమార్, నవాజ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, స్వామిచారి పాల్గొన్నారు.