జహీరాబాద్/ఝరాసంగం, అక్టోబర్ 25 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ఎల్గ్గోయి గ్రామంలో నిమ్జ్‌లో కోల్పోతున్న బాధిత రైతుల భూములను జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. ఈనెల 23న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమై ‘పరిహారం.. పరిహాసం’ అనే వార్త కథనానికి శుక్రవారం సంబంధిత జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి సంబంధిత అధికారులతో కలిసి ఎల్గోయి గ్రామాన్ని సందర్శించారు. భూ ములు కోల్పోయినా నష్టపరిహారం రాని బా ధిత రైతుల భూములను ఆమె పరిశీలించారు.
1975 నుంచి 2024 వరకు భూముల రికార్డులను బాధిత రైతులు డిప్యూటీ కలెక్టర్‌కు అందజేశారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం 2016లో సేకరించిన భూములకు పరిహారం మంజూరైనప్పటికీ తమకు ఎందుకు చెల్లించలేదంటూ బాధిత రైతులు అధికారులను ప్ర శ్నించారు. అప్పట్లోనే 54 సర్వే నంబర్లో భూములు కోల్పోయిన బాధిత రైతులకు పరిహారం చెల్లించామని డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అప్పట్లో లంచాలు ఇవ్వకపోవడంతోనే బై నంబర్లు సృష్టించి ఇతరులకు పరిహారాన్ని ఎలా చెల్లించారని అధికారులను బాధి త రైతులు నిలదీశారు.
పట్టా సర్టిఫికెట్లు ఉంటే భూ ములు ఎందుకు దున్ని పంటలు సాగుచేయలేదని డిప్యూటీ కలెక్టర్ బాధిత రైతులను ప్రశ్నించారు. ఆ భూముల్లో పంటలు సాగుచే స్తే కేసులు నమోదు చేస్తామని మండల రెవె న్యూ అధికారులు హెచ్చరించడంతో సాగు చేయలేదని బాధిత రైతులు వాపోయారు. తమకు పరిహారం చెల్లించే వరకు ఊరుకోమని, కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. కలెక్టర్‌ను నివేదిక పంపి బాధిత రైతులకు న్యాయం చేస్తామని డిప్యూటీ కలెక్టర్ చెప్పారు. ఆమె వెంట అధికారులు సిద్ధారెడ్డి, రామారావు, సర్వేయర్ నర్సింలు ఉన్నారు. తమ గోడును జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ‘నమస్తే తెలంగాణ’కు బాధిత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.