ఝరాసంగం, జనవరి 27 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి, బర్దిపూర్, చిలేపల్లి గ్రామాల్లో జాతీయ పెట్టుబడుల ఉ త్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్ట్ కో సం అధికారులు భూసేకరణ చేపట్టా రు. ఎల్గోయి గ్రామంలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని ప్రాజె క్టు కింద తీసుకున్నారు. భూములు కోల్పోయిన బాధిత కుటుంబానికి ఇంటికొక ఉద్యోగం, ప్లాటు కేటాయించాలని గతంలో నిమ్జ్ అధికారులను కోరారు. గత ప్రభుత్వ హ యాంలో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు భూములు కోల్పోయిన బాధితుల ఇంటి నిర్మాణాలు, సామూహిక భవనాలు, గ్రంథాలయం తదితర అ వసరాల కోసం భూమిని కేటాయించాలని గ్రామస్తులు విన్నవించా రు. వెంటనే స్పందించిన హరీశ్‌రావు చ ర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సభాముఖంగా ఆదేశాలిచ్చారు. వా రం రోజుల్లోనే రెవెన్యూ, టీఎస్ఐఐసీ బృందం సర్వే నిర్వహించాయి.
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభు త్వం కొలువుదీరిన క్రమంలో గ్రా మంలోని 125 సర్వే నెంబర్లో ప్ర భుత్వ ఉన్నత పాఠశాల పక్కన భూ బాధితులు, ఇండ్లులేని పేదకుటుంబాలు రేకుల షెడ్లు, ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుం డా శనివారం తెల్లవారుజామున నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అనురా ధ, స్థానిక తహసీల్దార్ సంజీవరావు, నయాబ్ తహసీల్దార్ యాసిన్, గిర్దవార్ రామారావు రేకుల షెడ్లు, ఇండ్ల ప్రహరీలను నాలుగు జేసీబీలతో కూ ల్చివేశారు. జహీరాబాద్ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో గ్రామం నలువైపు లా పోలీసు బలగాలను మోహరించి ఎక్కడివారినక్కడ చెల్లాచెదురు చేశా రు. భారీగా పోలీసులు గ్రామా న్ని చుట్టుముట్టడంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు.
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
ఎల్గోయి గ్రామంలో రేకుల షెడ్లు, ఇండ్ల ప్రహరీలు కూల్చివేయడంతో బాధితులను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, స్థానిక నాయకులతో కలిసి పరామర్శించి కూల్చివేతలను పరిశీలించారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, వాటిని పరిశీలించకుండా కొత్త ప్రభుత్వం రాగానే ఇలా చేయడం సరికాదన్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్‌పాటిల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, గ్రామ సర్పంచ్ ఓం ప్రకాశ్‌పాటిల్, నాయకులు బండి మోహన్, రమేశ్, అశోక్, విఠల్, బాల్‌రాజ్, మారుతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.