దౌల్తాబాద్, డిసెంబర్ 21 : గ్రామాల అభివృద్ధే లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగాయపల్లి తండాలోని జగదాంబ మాత సేవాలాల్ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లక్ష్యనాయక్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
గ్రామ అభివృద్ధి పై ప్రజలు చూపుతున్న విశ్వాసానికి కట్టుబడి ఉంటామని, గ్రామంలో ప్రస్తుతం కరెంట్ సమస్యను తక్షణమే పరిషరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి త్వరలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని, గ్రామస్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఇందుప్రియాల్ సర్పంచ్ వీరమ్మ స్వాతి స్వామి పాలకవర్గానికి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, మండల యువజన అధ్యక్షుడు నర్ర రాజేందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి, సర్పంచులు శేఖర్ రెడ్డి, దుర్గేశ్, ప్రకాశ్, మాజీ సర్పంచ్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.