అల్లాదుర్గం, అక్టోబర్ 19: పేదలకు న్యాయస్థానాలు మరింత చేరువ చేసేందుకే నూతనంగా కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి అన్నారు. మెద క్ జిల్లా అల్లాదుర్గంలో నూతనంగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ..నూతన సివిల్ కోర్టు ప్రారంభించుకోవడంతో రేగోడ్, శంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల వాసులకు సత్వర న్యాయం దొరుకుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మెయింటెనె న్స్ కేసులు త్వరగా పరిష్కరించాలని, చైల్డ్ కస్టడీ, విడాకులు, క్రిమినల్ కేసులు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాల్సి ఉం టుందని తెలిపారు.
కార్యక్రమంలో మెదక్ జిల్లా జడ్జి లక్ష్మీశారద, సబ్ జడ్జి జితేందర్, సివిల్ కోర్టు న్యాయాధికారి రీటాలాల్ చంద్, నర్సాపూర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి అనిత, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్‌గౌడ్, జనరల్ సెక్రటరీ శ్రీపతిరావు, న్యా యవాదులు ప్రతాప్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, సంగమేశ్వర్, కృష్ణారెడ్డి, బాలయ్య, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్, చిరంజీవి, రవి, శివచరణ్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్ఐలు ప్రవీణ్‌రెడ్డి, విఠల్, మహ్మద్‌గౌస్ పాల్గొన్నారు.
మెదక్ అర్బన్, అక్టోబర్ 19: మెదక్ కోర్టు ప్రాంగణంలో పీహెచ్‌సీని హైకోర్టు జడ్జి విజయసేన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ న్యా యవాదులు కొన్ని సమస్యలు జడ్జి దృష్టికి తీసుకువచ్చారు.
మెదక్ సీఎస్ఐ చర్చిని జడ్జి సందర్శించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి రీటాలాల్చంద్, నర్సాపూర్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అనిత, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్‌చంద్రగౌడ్, శ్రీపతిరావు, పోచయ్య, ప్రతాప్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, బాలయ్య, శ్రీనివాస్‌గౌడ్, రవిగౌడ్, చిరంజీవి, ప్రశాంత్ రులు ఉన్నారు.