పటాన్చెరు, డిసెంబర్ 26: సిద్ధి వినాయకుడి ఆశీస్సులతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధుముదిరాజ్ అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో పురాతన సిద్ధి వినాయక ఆలయంలో నీలం మధు ముదిరాజ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం నీలం మధుముదిరాజ్ రూ. 25లక్షలు విరాళంగా అందజేస్తున్నానని ప్రకటించారు. ఇలాంటి పురాతన ఆలయాలను ఆధునీకరించి పునర్వైభవం తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నమన్నారు. తనతో పాటు తన మిత్రులు విరాళాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.
కొత్త రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ హ యాంలో దేవాలయాలకు పునర్వైభవం ప్రారంభమైందన్నారు. పండుగలు, జాతరలు, ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దేనని అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నదని చెప్పారు. త్వరలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కావలి విఠల్, లక్ష్మణ్, శ్రీనివాస్, వెంకటేశ్, సీహెచ్ శ్రీనివాస్, రాములు, రాజు, రాజేశ్, విజయ్, జ్ఞానేశ్వర్, మధు, భూపాల్, గోపాల్ పాల్గొన్నారు.