
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 21: నిత్య జీవితంలో మానవుడు నిద్రలేచిన నుంచి పడుకునే వరకు అడుగడుగునా అవసరమయ్యేది గణితం. తెలుగు, ఇంగ్లిష్ ఇలా ఒకటి ఏమిటి అన్ని సబ్జెక్టులతో పాటు సంగీతం మొదలుకొని శాస్త్ర సాంకేతిక రంగం వరకు ప్రతి విషయంలో గణితం పాత్ర ఒక అద్బుత ఘట్టం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతగానో ఉపయోగపడే సైన్స్‌లో ప్రముఖ పాత్ర పోషించేది కూడా గణితమే. డిసెబంర్ 22 న జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని 2012 లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గణితాభివృద్ధికి విశేషంగా కృషిచేసి గణితంలో భారత్ ప్రపంచ దేశాల సరసాన నిలిచిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస అయ్యంగార్ రామానుజం జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకోవడం విశేషం. ఏ రంగంలో రాణించాలన్నా గణితం పాత్ర తప్పనిసరి అలాంటి గణితాన్ని రకరకాలుగా అధ్యాయనం చేసిన రామానుజం 1887 డిసెంబర్ 22న మన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని హిరోడ్ అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. శ్రీనివాస రామానుజం అతి చిన్న వయస్సులోనే గణితం వైపు దృష్టి మరల్చి గణిత శాస్త్రవేత్తగా ఎదిగి ప్రపంచ శాస్త్రవేత్తల సరసన నిలిచాడు. కేవలం 13 సంవత్సరాల వయస్సులోనే త్రికోణమితి చేసిన బాల మేథావిగా పేరుగాంచాడు.
ఏ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టకుండానే గణితాన్ని స్వయంగా అధ్యాయనం చేసిన మేథావిగా పేరు ప్రతిష్టలు పొందాడు, తన సహచర స్నేహితుడు జార్జ్కార్ రాసిన శుద్ధ అనువర్తన గణిత శాస్త్రగ్రంథం చూసి దానిలోని అనేక సిద్ధాంతాలకు విశ్లేషణాత్మక సూక్ష్మ వివరాలు రాశాడు. ఎలాంటి పట్టా లేకున్నా గణిత శాస్త్రంపై ఇతడికి ఉన్న మేథాశక్తిని గమనించిన మద్రాస్ విశ్వ విద్యాలయం 1913 వ సంవత్సరంలో నెలకు రూ.75 పారితోషకాన్ని అందజేసింది. అలాగే, ఇంగ్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త వీహెచ్. హార్డితో కలిపి సంఖ్యావ్యవస్థలో సర్కీల పద్ధతి, బీజగణిత అసమీకరణం, దీర్ఘవృత్తాకార ప్రమేయాలు వంటివి రాసిన ఘనత ఈయనదే. 1918లో సెలో ఆప్ రాయల్ సొసైటీ బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించింది. ఒక దశలో తాను జబ్బుకాలంలోనూ సంఖ్యల గురించి గణిత ఆలోచన నుంచి దూరం కాలేదు. ఒకరోజు తనను పరామర్శించడానికి వచ్చిన హార్డి కారు నెంబర్ 1729 పూరించి రెండు సంఖ్యాల గణాల మొత్తంగా గుర్తించాడు. అయితే దురదృష్టవశాత్తు క్షయవ్యాధిన పడ్డ ఆయన 1920 ఏప్రిల్ 26న మద్రాస్‌లో తుది శ్వాస వదిలారు. ఆయన గణిత శాస్ర్తానికి చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2012 నుంచి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా పరిగణించింది.
ప్రతి విషయంలో ఎంతగానో ఉపయోగపడే గణితానికి ప్రస్తుత తరుణంలో అనుకున్న రీతిలో ప్రాచూర్యం లభించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు గణితం అనగానే భయానికి గురి కావడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. గణితం లేని జీవితాన్ని జీవించలేం. గణితాన్ని ఉపయోగించుకోని విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందుతున్నారు. ఆంగ్లానికి 26 అక్షరాలు ఉండగా, తెలుగుకు 56 అక్షరాలు కానీ 9 అంకెలె ఉన్న గణితంపై విద్యార్థులు మక్కువ చూపకపోవడానికి గణితం అంటే ఏదో తెలియని భయమే కారణం. అయితే ప్రపంచ గణిత దినోత్సవానికి కూడా ఒక రోజంటూ లేక పోవడం గమనార్హం. గణితం విషయంలో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు ఒక సర్వేలో వెల్లడయ్యింది. సైన్స్ ఫేర్‌లో, సైన్స్ గణితానికి సంబంధించిన అంశాలు సందర్శించాల్సి ఉన్న గణితాన్ని పక్కకు పెట్టడం బాధాకారం.
రామానుజాన్ని ఆదర్శంగా తీసుకోవాలి..
కొత్త శాస్త్రవేత్తలుగా తయారు కావాలి. సాధన చేస్తే గణితం నేర్చుకోవడం సులభం. బట్టీ పట్టుకోకుండా సులభమైన మార్గాలతో నేర్చుకోవాలి. సైన్స్‌కు గణితానికి అత్యంత దగ్గరి సంబంధం ఉన్నా సైన్స్ అభివృద్ధి వైపే అందరి దృష్టి ఉంది. దానికి మూలమైన గణితాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.