పాపన్నపేట : ఏడుపాయల వన దుర్గ భవానీమాతను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు ఆలయ మర్యాదలు ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించగా పూజారులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.