నర్సాపూర్, జనవరి 31: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మున్సిపల్ మాజీ పాలకవర్గ సభ్యులతో కలిసి గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడు తూ..నర్సాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం ఈనెల 26న పూర్తి కావడంతో పాలకవర్గ సభ్యులతో వెళ్లి కలిసినట్లు తెలిపారు.
అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, కౌన్సిలర్లను హరీశ్‌రావు శాలువాలతో సన్మానించారు. వీరి వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు షేక్‌హుస్సేన్, శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు గౌడ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.