వర్గల్,మార్చి14 : మండలంలోని నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం హండీ లెక్కింపును నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఈవో కట్టా సుధాకర్‌రెడ్డి, పర్యవేక్షణ అధికారి కొండపోచమ్మ ఈవో మోహన్‌రెడ్డిల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు.
98రోజులకు గాను హండీ ద్వారా స్వామివారికి రూ.17,35,492 ఆదాయం వచ్చినట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు రాములుగౌడ్, చంద్రారెడ్డి, నంగునూరు సత్యనారాయణ, వెంకటస్వామి, సిబ్బంది సుధాకర్‌గౌడ్, నరేందర్, పాండు నర్సింలు, భ్రమరాంభిక సేవా సమితి హైదరాబాద్ సభ్యులు పాల్గొన్నారు.