Bhima Schemes | అక్కన్నపేట, మార్చి 20: ఖాతాదారులు బ్యాంకు సేవలతోపాటు బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ బాలనాగు అన్నారు. మరణించిన ఖాతాదారుల కుటుంబ సభ్యులకు బీమా ద్వారా వచ్చిన రూ. 30 లక్షల ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవాళ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని పంతుల్తండాకు చెందిన భూక్య శివలాల్ విద్యుత్ షాక్తో, కరంటోతు కవిత బస్సు ప్రమాదంలో ప్రమాదవశాత్తు చనిపోయారన్నారు. ఇద్దరికి తమ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉండటంతోపాటు ప్రమాద బీమా చేయించుకున్నారన్నారు. దీంతో శివలాల్ కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షలు, కవిత కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం బీమా సొమ్ము చెక్కును అందజేశామన్నారు.
ఖాతాదారులు బ్యాంకుల సేవలు, ఇన్సూరెన్స్ పథకాలను వాడుకోవడం వల్ల పరోక్షంగా కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సాయికృష్ణ, సుబ్బారావు, డెవీడ్, సమీర్, కుమార్, స్థానిక బ్యాంకు మేనేజర్ జ్యోత్స్న, ఫీల్డ్ ఆఫీసర్ సంతోష్, క్యాషియర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు