Quality Meals | విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి : ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి
Quality Meals | అందరూ విద్యార్థులకు చదవడం, రాయడం వచ్చే విధంగా ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందిగా ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలకు రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డిసూచించారు.
Quality Meals | రాయపోల్, నవంబర్ 28 : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరానగర్, వీరారెడ్డిపల్లి, వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్నం భోజనం తప్పనిసరిగా మెనూ ప్రకారం వడ్డించాల్సిందేనని నిర్దేశించారు.
అందరూ విద్యార్థులకు చదవడం, రాయడం వచ్చే విధంగా ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందిగా ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలకు సూచించారు. అనంతరం వీరారెడ్డి పల్లి పాఠశాలలోని ఓ విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి.. వడ్డేపల్లి ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థుల ఉద్దేశించి అందరూ 100% పాస్ అయ్యే విధంగా తగిన కార్యాచరణతో అందరిపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పిల్లలందరూ బాగా చదివి మండలానికి, పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.


Read Also :
Dalit Cook: దళిత మహిళను వంట చేయకుండా అడ్డుకున్న ఆరుగురికి జైలుశిక్ష
Deeksha Divas | తెలంగాణ భవన్లో దీక్షా దివస్.. దీక్షా దివస్‌పై డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్
Ditwa cyclone | దిత్వా తుఫాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. Video
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

