మెదక్ మున్సిపాలిటీ, జూలై 31 : మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం వాడీవేడిగా జరిగింది. ఈ సమావేశం చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఎజెండాలోని అంశాల పై ప్రస్తావించారు. పట్టణంలోని పాత బస్టాం డ్, పటేల్‌కుంటలో ఉన్న మున్సిపల్ సముదాయంలో దుకాణాలు పొందిన లబ్ధిదారులు వ్యాపారాలు నిర్వహించుకోకుండా మరొకరికి అధికంగా అద్దెకు ఇచ్చి లబ్ధి పొందుతున్నారని కౌన్సిలర్ లక్ష్మీనారాయణగౌడ్ అన్నారు. అ లాంటి వారిని తొలిగించి దుకాణాలకు వే లం వేయాలన్నారు. వేలం ద్వారా మున్సిపల్ కు ఆదాయం చేకూరుతుందన్నారు.
ఇందుకు పలువురు పాలకవర్గ సభ్యులు మద్దతు పలికారు. పట్టణంలోని ప్రధాన రహదారి ఇరువైపులా దుకాణాల ఎదుట ఉన్న పార్కింగ్ స్థలాల్లో టీస్టాల్, పానీపూరి, మిర్చి సెంటర్లు తదితర వాటిని నిర్వహిస్తున్న వారి నుంచి నెల నెలా రూ.8 వేల నుంచి 10 వేల వరకు డబ్బులు వసూళ్లు చేస్తున్న దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తెలిపారు. మార్కెట్లో శిథిలావస్థకు చేరిన మున్సిపల్ దుకాణాలను కూల్చి వేసి మూడేం డ్లు గడుస్తుందని వెంటనే నూతన సముదాయం నిర్మించాలని కౌన్సిలర్ కృష్ణారెడ్డి కోరారు.
ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదా ల్లో ముగ్గులు పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారని కౌన్సిలర్ మామిళ్ల అంజనేయులు గుర్తు చేశారు. రాందాస్ చౌరస్తాలో మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాల పనులు సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా ఎజెండాలోని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో కౌన్సిలర్లు లింగం, శ్రీనివాస్, షమీయొద్దిన్, జయరాజ్, శేఖర్, విశ్వం, వసంత్, బట్టి లలిత, దొంతి లక్ష్మి, కల్యాణి, శంసున్నిషా బేగం, వేదవతి, యశోధ, చందన, నిర్మల, మేఘమాల, అధికారులు పాల్గొన్నారు.