జిన్నారం, జూన్ 15: బొల్లారం మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 248లోని ఎకరా స్థలంలో హెటిరో లేబరేటరీస్ సౌజన్యంతో రూ.3.50 కోట్లతో నిర్మించనున్న మోడల్ పోలీస్ స్టేషన్ పనులకు మల్టీజోన్ ఐజీ సత్యనారాయణగౌడ్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కుమార్‌తో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. హెటిరో లేబరేటరీస్ డైరెక్టర్ మోహన్‌రెడ్డి ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమిపూజ చేశారు.
అనంతరం ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. మినీ ఇండియాగా పేరొందిన బొల్లారంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించాలనే లక్ష్యంతో మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికత, పూర్తిస్థాయి వసతులతో వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో నిర్మాణానికి సహకరిస్తున్న హెటిరో యాజమాన్యానికి, ప్రజా ప్రతినిధులకు ఐజీ ప్రత్యేకంగా పోలీస్‌శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు.
ము ఖ్యఅతిథులను పరిశ్రమ ప్రతినిధులు ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, సీఐలు రవీందర్‌రెడ్డి, నయీమొద్దీన్, ట్రాఫిక్ సీఐ లాలూనాయక్, కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, సీఎస్ఆర్ హెడ్ రవిబాబు, స్థానిక నాయకులు చంద్రారెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, ఆనంద్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, సంస్థ ప్రతినిధులు సుధాకర్, అరుణ్, రామరావు, స్థానికులు పాల్గొన్నారు.