మృగశిర కార్తె సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో సందడి నెలకొంది. రోహిణిలో వేడెక్కిన శరీరం చల్లబడేందుకు మృగశిర కార్తె రోజు చేపలు తినాలనేది ఆనవాయితీగా వస్తున్నది. సంగారెడ్డి మార్కెట్కు చేపలు భారీగా రావడంతో జనం ఎగబడ్డారు.
వ్యాపారులకు గిరాకీ బాగున్నా… కొనుగోలుదారులకు మాత్రం చేపల ధరలు చుక్కలు చూపించాయి. కిలో రూ.450 నుంచి రూ.600 వరకు అమ్మడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. అయినా మృగశిర కార్తె రోజు చేపలు తినాలని రేటు ఎక్కువైనా కొనుగోలు చేశారు. – సంగారెడ్డి ఫొటోగ్రాఫర్, జూన్ 7