పట్టభద్రుల ఆశాకిరణం రాకేశ్‌రెడ్డి
మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్‌ను శాసన మండలిలో పట్టభద్రుల తరపున ప్రశ్నించి న్యాయం చేసేందుకు గ్రాడ్యుయెట్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి వేయాలని ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలుయాదవ్, గదరాజు చందు కోరారు.
చేర్యాల, మే 25 : మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్‌ను శాసన మండలిలో పట్టభద్రుల తరపున ప్రశ్నించి న్యాయం చేసేందుకు గ్రాడ్యుయెట్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి వేయాలని ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలుయాదవ్, గదరాజు చందు కోరారు.
శనివారం మండలంలోని నాగపురి, ముస్త్యాల, పోతిరెడ్డిపల్లి గ్రామాలతో పాటు వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి, పట్టభద్రులను ఓటు అభ్యర్థించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి రాకేశ్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బండమీది కరుణాకర్, అడ్వకేట్ సురేందర్, సత్యం, మేరిండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతును గెలిపిద్దాం

కొమురవెల్లి, మే 25: వరంగల్- నల్లగొండ- ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతును గెలిపిద్దామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలారి కిషన్, బుడిగె రమేశ్‌గౌడ్, మకిలి కనకయ్య, బచ్చల పరశురాములు కోరారు. శనివారం మండలంలోని మర్రిముచ్చాల, గురువన్నపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రుల ఇంటికి వెళ్లి అభ్యర్థించారు.
బీఆర్ఎస్ నాయకుల ప్రచారం
మద్దూరు(ధూళిమిట్ట), మే25: మద్దూరు మండలంలోని మర్మాములలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోష్‌కుమార్, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం ఆధ్వర్యంలో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కమలాయపల్లిలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి, పట్టభద్రులను ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు సుందరగిరి స్రవంతిపరశురాములు, బొల్లు కృష్ణవేణీచంద్రమౌళి, పీఏసీఎస్ డైరెక్టర్ ఉత్కం మల్లేశం, నాయకులు మంద సుమన్, పీవీ నర్సింహారెడ్డి, కూరెళ్ల భిక్షపతి, మాజీ సర్పంచ్ ఓరుగంటి అంజయ్య, కొమురవెల్లి ఆలయ మాజీ డైరెక్టర్ వజ్రోజు శంకరాచారి, గ్రామశాఖ అధ్యక్షుడు రాజు, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

