ఝరాసంగం, నవంబర్ 30: ప్యారవరం గ్రామ శివారులో పీఆర్ఆర్ నిధులతో మంజూరైన హైలెవల్ బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్ రావు, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్లతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వాగుపై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను తొలిగించడానికి రూ.3 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామన్నారు.
మహిళాలకు అన్ని రంగాల్లో భాగస్వాములను చేస్తున్నామని, మండల సమాఖ్య తరఫున మంజూరైనా పెరటి కోళ్ల యూనిట్, మదర్ యూనిట్, న్యూ ఎంటర్ప్రైజెస్, పీఎంఎఫ్ఈ పథకాల చెక్కులను మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో ఏపీడీ జంగారెడ్డి, తహసీల్దార్ తిరుమలరావు, నాయబ్ తహసీల్దార్ యాసిన్‌ఖాన్, ఎంపీడీవో సుధాకార్, ఏపీఎం టిక్యా నాయక్, ఏపీవో రాజ్‌కుమార్, హన్మంత్‌రావు పాటిల్, వెంకటేశం, దేవదాస్, ఉజ్వల్ రెడ్డి, తన్వీర్, మల్లన్న పాటిల్, ఉదయ్ శంకర్ పాటిల్, నరేశ్ గౌడ్, అశ్విన్ పాటిల్, శంకర్ పాటిల్, జగదీశ్, ఎజాజ్ బాబా, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.