EX MLA Padma Devendar Reddy | మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 9 : ఈ నెల 27వ తేదిన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రతి పల్లె నుంచి తరలి వెళ్దామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
పల్లె పల్లెలో గులాబీ జెండా ఎగుర వేయాలని, వారం రోజుల్లో గ్రామాలు, పట్టణాలలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. పార్టీ ఇచ్చిన పిలుపును నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా అభివృద్ధి శూన్యమన్నారు. ఎక్కడ చూసినా కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ది పనులే కనిపిస్తున్నాయన్నారు.
ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్ సైడే ఉందన్నారు. వరంగల్ సభకు బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల అంజనేయులు, కో కన్వీనర్లు జుబేర్, కృష్ణాగౌడ్, మాజీ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్‌రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్