రామాయంపేట/ చేగుంట, ఫిబ్రవరి 20: మండల కేంద్రమైన చేగుంట మొబైల్ దుకాణంలో పనిచేసే వర్కర్ అదృశ్యమైన సంఘటన బుధవారం రాత్రి ఆలస్యంగా తెలిసింది. చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్ర వాసి మహ్మద్ అల్తాప్ బుధవారం మొబైల్ దుకాణానికి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తీరా మొబైల్ షాప్‌కు వెళ్లకుండా.. ఎవరికీ తెలియకుండా ఎక్కడికో గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లాడు.
మొబైల్ దుకాణం యజమాని అల్తాఫ్ తన వర్కర్ అల్తాఫ్ రాలేదేమిటని ఇంటికి కబురు చేయడంతో ఉదయమే షాపుకు వెళుతున్నానని బయలు దేరాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రైనా ఇంటికి రాకపోడవడంతో వారి కుటుంబీకుల వద్ద వెతికారు. ఎక్కడ కూడా సమాచారం లభించలేదు. దీంతో రాత్రి స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.