మనోహరాబాద్, మార్చి 29: నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మనోహరాబాద్ మండలం కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద శనివారం మాజీ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్ఫగుచ్చం అందజేసి, పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు.
అనంతరం బంగారమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి ముదిరాజ్, మండల ఉపాధ్యక్షుడు రతన్‌లాల్, యూత్ అధ్యక్షుడు రాహుల్‌రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు నరేశ్ ముదిరాజ్, కుమార్, నరేందర్‌గౌడ్, పంజా భిక్షపతి, నూకల వెంకటేశ్ పాల్గొన్నారు.