చేర్యాల, మే 27 : వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగల రాకేశ్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జనగామ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నిక ఇన్చార్జి, సిరిసిల్లా రాజన్న జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న అన్నారు. పట్టణంలో ఉప ఎన్నిక సందర్భంగా ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు మాసాల్లో పరిపాలనలో అన్ని విధాలుగా విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను అమలు చేయలేదని, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, కొంతమందికి ఉచిత కరెంట్ ఇస్తే హామీలు అమలు చేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
బీఆర్ఎస్ సర్కారు పాలనలో కేసీఆర్ అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.తన సొంత దవాఖానలో నియోజకవర్గ ప్రజలు ఉచితంగా వైద్యం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. పట్టభద్రులు తమ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆదరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి, మండల, టౌన్ అధ్యక్షులు అనంతుల మల్లేశం, ముస్త్యాల నాగేశ్వర్రావు, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి కోతి దాసు, సీనియర్ నాయకులు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, కౌన్సిలర్లు మంగోలు చంటి, పచ్చిమడ్ల సతీశ్, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గదరాజు యాదగిరి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలు, గదరాజు చందు, బండమీది కరుణాకర్, మహిళా నాయకురాలు తాడెం రంజితాకృష్ణమూర్తి, మీస పార్వతి, పచ్చిమడ్ల మానస, ఎంపీటీసీ శివశంకర్, యూత్ మండల అధ్యక్షుడు అకుల రాజేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
మిరుదొడ్డి, మే 27: జూన్ 4వ తేదీన వెలువడే మెదక్ ఎంపీ ఫలితాల్లో వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు గొల్ల రాములు అన్నారు. సోమవారం మిరుదొడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందన్నారు. రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సిరినేని వెంకటయ్య, ఎల్ముల శేఖర్, గొట్టం స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.