పెద్దమ్మతల్లి చల్లగా చూడాలి
ప్రజలను పెద్దమ్మతల్లి చల్లగా చూడాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండలంలోని పెద్దకోడూరు, కిష్టాపూర్ గ్రామాల్లో శనివారం పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
చిన్నకోడూరు/నారాయణరావుపేట, మే 25: ప్రజలను పెద్దమ్మతల్లి చల్లగా చూడాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండలంలోని పెద్దకోడూరు, కిష్టాపూర్ గ్రామాల్లో శనివారం పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నిర్వాహకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ పెద్దమ్మతల్లి దయతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, వైస్‌ఎంపీపీ కీసరి పాపయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భూంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ సాయన్న, మాజీ సర్పంచ్‌లు అంగమూర్తి, కవిత, మధు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

