ప్రతి ఏడాది క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా జరుపుకొంటున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ పండుగలకు కానుకలు అందజేస్తున్నామన్నారు. క్రైస్తవుల మధ్య క్రిస్మస్ కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. క్రైస్తవుల సమాధుల కోసం స్థలాలను కేటాయించామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో చర్చీల నిర్మాణానికి సహకారం అందించామని చెప్పారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
సిద్దిపేట, డిసెంబర్ 22: ప్రతి ఏడాది క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా జరుపుకొంటున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్లో నిర్వహించిన వేడుకలకు హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ కానుకాలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు, రంజాన్‌కు ముస్లింలకు, బతుకమ్మ పండుగకు హిందువులకు కొత్త బట్టలు అందించామన్నారు. అందరూ కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలని ఈ కానులను అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని క్రైస్తవులందరి మధ్య క్రిస్మస్ కేక్ కట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజ లు సంతోషంగా ఉండాలని, శాంతితో, రాగద్వేషాలు లేకుండా ప్రజలందరూ బాగుండాలి ఏసుక్రీస్తు బోధించాడన్నారు. నియోజకవర్గంలో చర్చీల నిర్మాణానికి వ్యక్తిగతంగా సహకారం అందిస్తున్నానని తెలిపారు. చర్చి కట్టుకుంటామని వచ్చిన వారికి సహకరించానన్నారు. సిద్దిపేటలో క్రైస్తవ భవనం చకగా నిర్మించుకున్నామని, క్రైస్తవుల కోసం సమాదుల నిర్మాణానికి స్థలం కేటాయించామన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, సిద్దిపేట అన్ని రంగాల్లో ముందుండాలని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రమేశ్, క్రైస్తవ మత పెద్దలు సికిందర్, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.