బెజ్జంకి, అక్టోబర్ 20: కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీ రు హరీశ్‌రావు ఆరోపించారు. తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లిలో జరిగే అలయ్ బలయ్, ధూంధాం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయనకు బెజ్జింకి క్రాసింగ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 100 రోజుల్లో 420 హామీలు, 13 గ్యారెంటీలను అమలు చేస్తామని బ్యాండ్ పేప ర్ మీద రాసి ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ రోజు హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు.
హామీల బాధ్యత మాది అని ఆనాడు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ప్రకటించారని, ఈ రోజుల ఆ గాంధీలు మాయమైపోయారని, వారు హా మీల గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు రూ.10 వేలు ఇస్తే, తాము అధికారంలోకి వస్తే రూ.15 వేలు రైతు భరోసా ద్వారా ఇస్తామని చెప్పి, నిన్న వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా వానకాలం పంటకు రైతు భరోసా ఇవ్వమని ఎగబెట్టారని విమర్శించారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్టు, న్యూట్రీషన్ కిట్టు ఇవ్వడం లేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే, నేడు కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటి రద్దు చేస్తున్నదని హరీశ్‌రావు అన్నారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వ డం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేని సమయంలో సైతం కేసీఆర్ సర్కార్ రైతులకు రైతుబంధు ఇచ్చి కాపాడుకున్నదని గుర్తు చేశా రు. 11 విడుతల్లో రాష్ట్రంలో రూ.72 వేల కోట్లు రైతుబంధు కేసీఆర్ ఇస్తాడెట్ల..ఒక్కసారికే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముక్కులోకి వచ్చిందా..అని విమర్శించారు.
రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు. వడ్ల కొనుగోలు కేం ద్రాలు ఎక్కడా ప్రారంభం కాలేదని, కేంద్రాలకు ఇప్పటి వరకు గన్నీ బ్యాగులు, దారం, రైస్‌మిల్లులు, ట్రాన్స్పోర్ట్ అలాట్ కాలేదన్నారు. సన్నాలు పండించిన ప్రతి రైతుకు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సంబంధం లేకుండా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పంటలకు బోనస్ బోగస్ అయిందని ఎద్దేవా చేశారు. బెజ్జంకి మండలంలో పత్తి ఎక్కువగా పండుతుందని, కానీ.. ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదన్నారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకు పత్తిని అమ్ముకుని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు, పత్తి, మక్కల కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభం చేయలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు.
సీఎం రేవంత్ రోజుకో కార్యక్రమం పెడుతున్నాడని, కేవలం ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్పా ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ సర్కారు అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర లో ఉండి రైతుల ఉసురు పోసుకుంటుందని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే అన్ని పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఎన్నికల హామీలు నిటబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లింగాల నిర్మల, మాజీ జడ్పీటీసీ కనగండ్ల కవిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, లక్ష్మణ్, తిరుపతి, శ్రీనివాస్‌గుప్తా, రాజయ్య, లక్ష్మారెడ్డి, తిరుపతిరెడ్డి, దేవయ్య, రామాలింగ రెడ్డి, రాజు, మోహన్, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.