శివ్వంపేట, అక్టోబర్ 18: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గిరిజనుల కుటుంబాలకు అండగా ఉంటామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నా రు. ప్రమాదంలో మృతిచెందిన తాళ్లపల్లితండా, జగ్యతండా, భీమ్లతండాలో బాధిత కుటుంబాలను శుక్రవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పి తనవంతు ఆర్థిక సహా యం అందజేశారు.
అనంతరం ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు. ఏడుగురు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం చాలా బాధాకరమైన ఘటన అని, మృతులంతా రక్తసంబంధీకులే కావడంతో ఒక్కొక్కరి బాధలు చూస్తుం టే గుండె తరుక్కుపోతుందన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా కలెక్టర్, సీఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. డబుల్‌రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసి కల్వర్టుల వద్ద పొంచిఉన్న ప్రమాదాలను అరికట్టాలని అధికారులకు సూచించారు.
బాధిత కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా తామందరం అండగా నిలబడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రైతుబీమా వచ్చేలా అధికారులతో మాట్లాడతానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, ఆత్మకమిటి మాజీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ నయీమొద్దీన్, సీనియర్ నాయకులు యాదాగౌడ్, సంతోష్‌రెడ్డి, మర్రి మహేందర్‌రెడ్డి, నాగేశ్వర్రావు, లాయక్, మాజీ సర్పంచ్ చెన్నానాయక్, సిలువేరు ఆంజనేయులు, యువత అధ్యక్షుడు పవన్‌గుప్తా ఉన్నారు.