హత్నూర, అక్టోబర్ 20: రైతులను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం హత్నూ ర మండలం దౌల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆరుగ్యా రెంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రజలను నట్టేట ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సగంమంది రైతులకే పంట రుణమాఫీ చేసి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు వానకాలం రైతుభరోసా ఎగ్గొట్టి మరోసారి మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటున్నట్లు తెలిపారు. ఆం దోళన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, లేబర్ వెల్ఫే ర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, బీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.