శివ్వంపేట, నవంబర్ 7: మండలంలో ధాన్యం తూకాలు వేగంగా వేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని గంగాయిపల్లి, శబాష్‌పల్లి, దొంతి, పాంబండ, కొత్తపేట, లింగోజిగూడ, తాళ్లపల్లి తండాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో గురువారం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసీనిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ..సన్నవడ్లకు బోనస్ ఇస్తామని అనడం సరికాదన్నారు. సన్నరకం వడ్లు ఎప్పుడు కొనుగోలు చేసి బోనస్ చెల్లిస్తారో ప్రభు త్వం చెప్పాలన్నారు.
దళారులకు ధాన్యం అమ్మి రైతులు నష్టపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ఇప్పటివరకు గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మహిపాల్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, పులిమామిడి నవీన్ గుప్తా, బాసంపల్లి శ్రీనివాస్‌గౌడ్, తాటి పవన్ గుప్తా, మర్రి మహేందర్ రెడ్డి, గూడూరు యాదగౌడ్, ఏనుగు అశోక్ రెడ్డి, రంగపల్లి పార్వతి సత్యం, కన్నారం దుర్గేశ్, మొలుగు నాగేశ్వరరావు, ఎండీ లాయక్, బుద్ధుల భిక్షపతి, పీఏసీఎస్ సీఈవో మధు తదితరులు పాల్గొన్నారు.