శివ్వంపేట, డిసెంబర్ 4 : కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, అక్రమాలను బయటపెడుతున్నందుకే మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావుపై కేసులు నమోదు చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్‌పల్లిలో బీఆర్ఎస్ నాయకులతో కలి సి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చక్రధర్‌గౌడ్ చదివితే పోలీసులు హరీశ్‌రావుపై అక్రమంగా కేసులు పెట్టడం ఏమిటని మండిపడ్డారు.
ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చకుండా ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హరీశ్‌రావుపై కక్షగట్టి కేసులు బనాయిస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ము ఖ్యమంత్రి మాటలకు, మంత్రుల మాటలకు పొంతన లేదన్నారు. హరీశ్‌రావుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయ కులు రమణ, కల్లూరి హరికృష్ణ, కన్నారం దుర్గేశ్, నాగేశ్వరరావు, జగజీవన్రెడ్డి, లక్ష్మీనర్సయ్య, దేవలింగం, రమేశ్ పాల్గొన్నారు.