చేగుంట,అక్టోబర్24: దుబ్బాకకు టైం పాస్ ఎమ్మెల్యే దొరికాడని, అమాయక ప్రజలను మోసం ఎమ్మెల్యే రఘునందన్‌రావు గత ఎన్నికల్లో అనేక మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి, పైసా పని చేయకుండా అంతా తానే చేసినట్లు ఫొటోలకు ఫోజులు తప్ప చేసింది ఏమీలేదని మెదక్ పార్లమెంట్ సభ్యులు,దుబ్బాక బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నా రు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని ఎమ్మెల్యేతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. చేగుంట మండలంలోని వడియారం గోల్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం చేగుంట మండలం పులిమామిడి మాజీ సర్పంచ్ నాయిని రాజ్‌గోపాల్, భారతీయ కిసాన్ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు సత్తురాజిరెడ్డి తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రుక్మాపూర్ మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మ్యాకల వెంకటస్వామి, రెడ్డిపల్లి మాజీ ఎంపీటీసీ గర్ధాస్ రామారావుతో పాటు, చేగుంట, నార్సింగి మండలాల బీజేపీ, కాగ్రెస్ పార్టీల నుంచి సుమారు 6వందలకు పైగా ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కొత్త పాత లేకుండా కార్యకర్తలు, సైనికుల సమన్వయంతో పని చేయాలన్నారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అమాయక ప్రజలను మోసపూరిత మాటలతో మోసం చేసి గెలిచారన్నారు. ఎమ్మెల్యే నియోజక వర్గంలో అభివృద్ధి చేయకుండా టైం పాస్ చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ నుంచి నేరుగా డబ్బులు తెచ్చి అభివృద్ధి చేస్తానాని ప్రజలను మోసం చేశాడన్నారు. అనేక హామీలు ఇచ్చిన రఘునందన్‌రావు ఇప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో అన్ని రకాల తాయిలాలు ఇచ్చే పనిలో పడ్డారని, వాటికి మోస పోకుండా ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. బీజేపీకి క్యాడర్ లేదు, కాంగ్రెస్‌కు లీడర్ లేడని, నియోజకవర్గంలో కొంతమంది నాయకులను కొనుగోళ్లు చేయడమే పనిగా పెట్టుకున్నరన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కేవలం ప్రజా సంక్షేమ పార్టీ, పేదలకు, రైతులకు ఉపయోగపడే విధంగా రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, 24 గంటల వ్యవసాయానికి విద్యుత్ సౌకర్యం, సాగు నీరు, ఇంటింటికీ తాగునీరు, కల్యాణలక్ష్మీ, విద్య, వైద్యం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ప్రభుత్వాని మరోసారి దీవించేందుకు గ్రామాల్లోని ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టేలా నాయకులు, కార్యకర్తలు గడపగడపకూ పోయి, సంక్షేమ పథకాల గురించి వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి, చేగుంట, నార్సింగి ఎంపీపీలు మాసుల శ్రీనివాస్, చిందం సబితా, జడ్పీటీసీలు ముదాం శ్రీనివాస్, బాణాపురం క్రిష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికల్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి, దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ చైర్మన్ కోమండ్ల నారాయణరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు జింక శ్రీనివాస్, వైస్ చైర్మన్లు పట్నం తానీషా, తీగుల్ల ఆంజనేయులు, టెలికాం బోర్డు మాజీ సభ్యులు అంచనూరి రాజేశ్, తీగుల్ల వేణుగోపాల్‌శర్మ, వడియారం సర్పంచ్ వడ్డెపల్లి తిరుమల నర్సింహులు, మైనార్టీ నాయకులు నదీంతో పాటు గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.