కల్హేర్, ఫిబ్రవరి 24: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు హామీలను రెండురోజుల్లో అమలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని మాసాన్‌పల్లి, దేవునిపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లు, అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బ్యాం కుల్లో తీసుకున్న రూ.2లక్షల పంటరుణాలను మాఫీ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసే వివిధ అభివృద్ధి పనుల బిల్లులను తొరగా చెల్లిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో సింగూరు ప్రాజెక్టు నుంచి నల్లవాగు ప్రాజెక్టులోకి నీళ్లు తరలించేందుకు కాలువల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించగా సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేశారన్నారు. నల్లవాగు కింద ప్రస్తుతం సాగవుతున్న ఆరువేల ఎకరాలు కాకుండా మరో రెండువేల ఎకరాలు సాగు చేసేందుకు నీళ్లు అవసరమన్నారు.
కాలువలు నిర్మించి నాగల్గిద్ద, మనూరు, కంగ్టి మండలాల రైతులకు సాగు నీరందించేలా చూడాలని సీఎంను కోరామన్నారు. అక్రమంగా ఇసుకను తరలించే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామా ల్లో నిర్మించిన క్రీడాప్రాంగణాలు నిరూపయోగంగా ఉన్నాయన్నారు. మాసాన్‌పల్లిలో ఉన్న త పాఠశాల నూ తన భవనం, కల్హేర్‌లో అంగన్వాడీ భవనం నిర్మించాలని గ్రామస్తులు కోర గా ఎమ్మెల్యే స్పందించి వచ్చే ఏడాదిలో చర్య లు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ మండ ల అధ్యక్షుడు మల్లేశం, మాసాన్‌పల్లి మాజీ సర్పంచ్ గోపాల్, నాయకులు సంజీవరెడ్డి, భాస్కర్‌గుప్తా, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, శంక ర్, దుర్గారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
నారాయణఖేడ్, ఫిబ్రవరి 24: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి ప నులకు రూ.20కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మె ల్యే తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని బసవేశ్వర చౌక్ నుంచి మంగల్‌పేట్ ముదిరాజ్ భవన్ వరకు సీసీ రోడ్డు ఏర్పాటుకు రూ. 5కోట్లు, పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి మున్సిప్ కోర్టు వరకు రోడ్డు అభివృద్ధికి రూ. 2కోట్లు మంజూరయ్యాయన్నారు. అన్ని వార్డు లో పలు అభివృద్ధి పనులతోపాటు అంగన్వా డీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం మ రో రూ. 65కోట్లు మంజూరయ్యాయన్నారు. నియోజకవర్గంలోని రోడ్ల ఏర్పాటుకు రూ.29 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని, త్వరలో నిధులు మంజూరవుతాయన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈనెల 27న ప్రారంభించనున్నట్లు తెలిపారు.