చేర్యాల, నవంబర్ 8 : చేర్యాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు సాయి ఏర్పాటు చేసుకున్న ఎస్ఆర్ కార్ వాషింగ్ సెంటర్‌ను శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణిశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి,మాజీ ఎంపీపీ వుల్ంలంపల్లి కరుణాకర్‌తో కలిసి ఎమ్మెల్యే పల్లా ప్రారంభించారు.ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చేర్యాలలో కోర్టు ఏర్పాటు ప్రక్రియ బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైందన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో సైతం చేర్యాల కోర్టు ఏర్పాటు కోసం లేఖను సంబంధిత అధికారులకు అందజేసినట్లు గుర్తుచేశారు. కోర్టు ఏర్పాటు కోసం ఎంపీడీవో భవనాన్ని కేటాయించామని, అనంతరం రూ.20 లక్షల విలువైన ఫర్నిచర్ సరఫరా చేసినట్లు తెలిపా రు.
కోర్టు భవన ఏర్పాటు పనులు ఆలస్యం అవుతున్నాయని తన దృష్టికి రావడంతో కాంట్రాక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తన విజ్ఞప్తితో ప్రభుత్వం చేర్యాల కోర్టుకు 27 మంది సిబ్బందిని కేటాయించిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు,ధూళిమిట్ట అధ్యక్షుడు మంద యాదగిరి,యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలుయాదవ్, గదరాజు చందు, బీరెడ్డి ఇన్నారెడ్డి, ఉట్కూరి అమర్‌గౌడ్, మంచాల కొండయ్య, టౌన్ సెక్రటరీ బూరగోని తిరుపతిగౌడ్, తాడెం రంజితాకృష్ణమూర్తి, పచ్చిమడ్ల మానస, యాట భిక్షపతి పాల్గొన్నారు.
మండలంలోని వేచరేణి గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ పర్పాటక ధర్మారెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంతో మృతి చెందడంతో శుక్రవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. తాము అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. యేనుగుల దుర్గయ్య, పర్పాటకం దుర్గారెడ్డి, వకులభరణం నర్సయ్య పంతులు, గదరాజు యాదగిరి, బండమీది కరుణాకర్, అరిగె కనకయ్య, బొంగు రాజేందర్‌రెడ్డి ఉన్నారు.