నిజాంపేట, అక్టోబర్ 31 : అమలు కాని హామీలను ఇస్తు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల (బీజేపీ, కాంగ్రెస్) మాయమాటలను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నస్కల్, నందగోకుల్, నగరం, జడ్చెరువు తండాలో పర్యటించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యేపద్మాదేవేందర్రెడ్డికి ప్రజలు అప్యాయంగా మంగళహారులతో స్వాగతం పలికారు.
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నది బీఆర్ఎస్సే అని, ఎమ్మెల్యేల టికెట్లు అమ్మకున్నది కాంగ్రెస్ అన్నారు. మూడు పంటలకు సరిపడా కరెంట్ ఇస్తూ కర్షకుల కడుపు నింపడా నికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే, మూడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్‌రెడ్డి కారు కూతలు కూస్తున్నా రని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి గొడువలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. 13 ఏండ్లుగా గుర్తుకు రాని మెదక్ నియోజకవర్గం ఇప్పుడు కొడుకు కోసం వచ్చాడని, ఎన్నికల్లో గెలవడానికి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. రైతుబం ధు పథకాన్ని ఆపేయాలని ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులకు ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక గతే పడుతుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుకే ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే తెల్లరేషన్ కార్డుపై ప్రతి సన్నబియ్యం, రూ.400 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. చల్మెడలో ఇటీవల మృతి చెం దిన యాదవరెడ్డి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.
ఓటమి భయంతోనే కాంగ్రెస్ కార్యకర్త ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డాడని ఇది ప్రజాసామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ సిద్ధిరాములు, మాజీ జడ్పీటీసీ విజయలక్ష్మి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు రాజు, సర్పంచ్‌లు అనూష, కవిత, బాల్‌నర్సవ్వ, అరుణ్‌కుమార్, గేమ్‌సింగ్, ఎంపీటీసీలు బాల్‌రెడ్డి, సురేశ్, మండల కో-అప్షన్ సభ్యుడు గౌస్, పీఏసీఎస్ చైర్మన్లు కొండల్‌రెడ్డి, బాపురెడ్డి, బాదె చంద్రం, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ భాస్కర్‌రావు, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ ఎంపీపీ సంపత్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి, ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశం, రవి, మంగ్యానాయక్, చల్మెడ మాజీ ఎంపీటీసీ కిష్టాగౌడ్, నాయకులు లక్ష్మీనర్సింహులు, సత్యనారాయణ, సుధాకర్, సుభాశ్, నాగరాజు, పర్శగౌడ్, రాజు, రంజిత్, లక్ష్మణ్, మహేశ్, నగేశ్, దయాకర్, ధర్మరెడ్డి, దుబ్బ రాజు, శ్రీనివాస్, ఎల్లం తదితరులు ఉన్నారు.