ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం
ప్రయాణికుల సౌకర్యం కోసం కోట్లు ఖర్చుచేసి దుబ్బాకలో బస్టాండ్ భవనాన్ని నిర్మిస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- దుబ్బాక బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక, జూన్ 29: ప్రయాణికుల సౌకర్యం కోసం కోట్లు ఖర్చుచేసి దుబ్బాకలో బస్టాండ్ భవనాన్ని నిర్మిస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అధునాతన హంగులతో దుబ్బాక బస్టాండ్ భవన నిర్మాణం చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలోనే దుబ్బాక బస్టాండ్ మోడల్‌గా నిలిచిందన్నారు. ఆర్టీసీ, ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఈవిషయమై దుబ్బాక డిపో ఇన్చార్జి కనకలక్ష్మికి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సంగీతారవీందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

