జహీరాబాద్, అక్టోబర్ 20: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వందశాతం రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు చెల్లించే వరకు వదిలేది లేదంటూ జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఎగ్గొట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జహీరాబాద్ లో ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం నుంచి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆనంతరం 65వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు రాంరాం అని అసెంబ్లీలో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను అక్షరాలా రేవంత్‌రెడ్డి నిజం చేస్తున్నారన్నారు. ఇప్పటికే రుణమాఫీ లో మోసం చేసినట్టుగా, వానకాలం పంట చేతికందే సమయం వచ్చినా రైతు భరోసా ఇవ్వకుం డా.. చివరికి ఇచ్చేది లేదంటూ మాట దాట వేయ డం సిగ్గుచేటని మండిపడ్డారు.
రైతులను విస్మరిస్తే కాంగ్రెస్ సర్కారుకు పుట్టగతులు ఉండవని ఎమ్మె ల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. జహీరాబాద్ బస్టాండ్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆందోళనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ, రవీందర్, నర్సిం హులు, వెంకటేశం, నారాయణ, నాయకులు గుండప్ప, యాకూబ్, స్రవంతిరెడ్డి, మచ్చేంధర్, సంజీవ్‌రెడ్డి, నర్సింహారెడ్డి, బండిమోహన్, ఎం ఆర్ ప్రవీణ్‌కుమార్, అమీర్, చంద్రశేఖర్‌రెడ్డి, కార్యర్తలు, రైతులు పాల్గొన్నారు.