జహీరాబాద్, సెప్టెంబర్ 19: కాంగ్రెస్ అసమర్థ పాలనతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఝరాసంగం మండలంలోని జొన్నగామకు చెందిన మాజీ సర్పంచ్ బోయిని బక్కయ్య, నాయకులు నర్సింలు, లక్ష్మారెడ్డి, నర్సింహారెడ్డి, వెంకటేశం తదితరులు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసం చేశారన్నారు. గ్రామాలకు అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రభు త్వ నిర్లక్ష్య వైఖరితో రైతులకు యూరియా లభించక ఇబ్బందులకు గురవుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, నాయకులు తట్టునారాయణ, మచ్చేంధర్, సంగమేశ్వర్, కృష్ణ, ఎల్లయ్య, వీరన్నపాటిల్, శివకుమార్, సంగమేశ్, అంజన్న, విఠల్, బస్వరాజ్‌పాటిల్, శ్రీనివాస్‌రెడ్డి, శశివర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.