సిద్దిపేట, అక్టోబర్19: సిద్దిపేట నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులకు సూచించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోఆపరేటివ్ చైర్మన్లు, సివిల్ సైఫ్లయ్, డీఎస్వో, మారెటింగ్, కోఆపరేట్ అధికారులు, నియోజకవర్గంలోని మండలాల ఏపీఎంలతో ధాన్యం కొనుగోలు కేం ద్రాలపై సమీక్ష నిర్వహించారు.
మండలాల వారీగా కేంద్రాలపై ఆరాతీశారు. చిన్నకోడూరు మండలం రామంచ, నంగునూర్ మండలంలో ఒకటి, సిద్దిపేట రూరల్‌లో మూడు కేంద్రాలు, అర్బన్ మండంలోని మందపల్లిలో ఒకటి, నారాయణరావుపేటలో ఒక కొనుగోలు కేంద్రం ప్రారంభమైందని అధికారులు హరీశ్‌రావుకు వివరించారు. విగతా ప్రాంతాల్లో కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించాలని ఏపీఎంలను హరీశ్‌రావు ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని విద్యుత్ అధికారులకు ఫోన్ లో సూచించారు.