పటాన్చెరు, జూలై 5: తెలంగాణ విద్యార్థులు విశ్వవ్యాప్త గుర్తింపు పొంది దేశానికే ఆదర్శంగా నిలవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో పదో తరగతిలో నియోజకవర్గస్థాయిలో ప్రతిభను చాటి, టాపర్లుగా నిలిచిన 960మంది ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానం చేసి, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిభకు కులం, మతం, పేదరికం అడ్డుకావన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివితే గొప్ప జీవితం లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను వమ్ముచేయకుండా బాగా చదవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులందరి సంక్షేమం కోసం పాటుపడుతున్నదన్నారు. దేశంలోనే తొలిసారిగా వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనన్నారు. ప్రతి ప్రభుత్వ విద్యార్థిపై లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగంపై, వైద్యరంగంపై ప్రత్యేక శ్రద్ధను కనబర్చుతున్నారని కొనియాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమన్నారు. బంగారు భవితకు బాటలు వేసేందుకు ఈ ఫలితాలు ఉపయోగపడుతాయన్నారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.
కేజీ టు పీజీ విద్య అందుబాటులోకి..
పటాన్చెరు నియోజకవర్గంలో కేజీ టు పీజీ వరకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిల్లాలో పటాన్‌చెరులోనే మొదటగా స్నాక్స్ అందజేసి టెన్త్ విద్యార్థులను ప్రోత్సహించామని గుర్తు చేశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులతో మోటివేషనల్ తరగతులను నిర్వహించామన్నారు. పటాన్చెరులో చేపట్టిన కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను అందజేస్తున్నదన్నారు. ఈ సందర్భంలో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు టాపర్లుగా రావడంతో ఎమ్మెల్యే వారిని గుర్తించి వారిని సత్కరించడం అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు.
ఎమ్మెల్యే ఇస్తున్న ప్రోత్సాహం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నదని టీచర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డీఎస్పీ భీంరెడ్డి, ఎంపీపీలు ప్రవీణ విజయభాస్కర్‌రెడ్డి, సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, సుప్రజావెంకట్‌రెడ్డి, కుమార్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్లు రోజా బాల్‌రెడ్డి, లలితాసోమిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీశైలంయాదవ్, వెంకటేశ్‌గౌడ్, పటాన్చెరు ఎంఈవో పీపీ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.