గ్రామాలకు మహర్దశ కల్పించాం
గ్రామాలకు మహర్దశ కల్పించామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండలం ఇంద్రే శం గ్రామంలో జీవీఆర్ ఎంటర్ ప్రైజెస్ సౌజన్యంతో రూ.3.46 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మె ల్యే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
- నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం
- పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
- ఇంద్రేశంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ
పటాన్చెరు, అక్టోబర్ 6: గ్రామాలకు మహర్దశ కల్పించామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండలం ఇంద్రే శం గ్రామంలో జీవీఆర్ ఎంటర్ ప్రైజెస్ సౌజన్యంతో రూ.3.46 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మె ల్యే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రావడంతోనే అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చేస్తున్న అభివృద్ధితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు.

సమృద్ధిగా నిధులు ఇచ్చి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. హరితహారంలో చెట్లు పెరగడంతో గ్రామాలు పచ్చగా కనిపిస్తున్నాయన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నర్సరీలు, సీసీ రోడ్లు గ్రామాల్లో కనిపిస్తున్నాయన్నారు. మిషన్‌భగీరథతో పరిశుభ్రమైన నీరు అందుతున్నదన్నారు. పవర్ కట్ అనే మాటే లేదన్నారు. వైకుంఠధామాల్లో సౌకర్యాలు కల్పించామన్నారు. ఇంద్రేశం గ్రామంలో నిధుల వరద పారించి అభివృద్ధి చేశామన్నారు.
ఇంద్రేశం గ్రామంలో బతుకమ్మ చీరలను మహిళలకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుప్రజా వెంకట్‌రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఏఈ పీఆర్ మల్లేశం, సర్పంచ్ దండు నర్సింహులు, ఎంపీటీసీ పేట మాణెమ్మ, ఉప సర్పంచ్ ఎన్ఎం.శివకుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ మాణిక్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, హరిశంకర్, శాంతి, కార్యదర్శి సుభాష్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

