సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 17: జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్ర భాకర్ అధికారులను కోరారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిసి వినతిపత్రం అం దజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో మార్గదర్శకాలు పాటించడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. మార్గదర్శకాలను పాటించేలా చూడాలని, అర్హులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే వెం ట మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విజయేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.