కోహెడ ఆగస్టు 21: మేజ ర్ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొ న్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్‌లో నూతనం గా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి, జిల్లా వైద్యాధికారితో కలిసి ఆయన ప్రారంభించా రు.
ఈసందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు. అనంతరం దవాఖానలో ఉన్న మందులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేఖ, వైద్యాధికారి నిమ్రా, నాయకులు మంద ధర్మయ్య, శెట్టి సుధాకర్, ముంజ తిరుపతి, గొరిట్యాల లక్ష్మణ్, భీంరెడ్డి తిరుపతిరెడ్డి, కర్ర రవీందర్ పాల్గొన్నారు.