కోహెడ, అక్టోబర్ 26: బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మండలంలోని మధ్య తరహా ప్రాజెక్టు శనిగరంలో కలెక్టర్ మనుచౌదరితో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ..మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తులు మారాలన్నారు. మత్స్య శాఖకు సంబంధించి మొబైల్ మార్కెట్లో అమ్ముకోవడానికి మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తామన్నారు.
శనిగరం దగ్గర ప్రభుత్వ భూమి లో ఫిష్ మార్కెట్ పెడతామని, అందుకు స్థల సేకరణ చేయాలని ఆర్డీవోకు ఆయన సూచించారు. హైదరాబాద్‌కు పోయేవారు ఇక్కడ చేపలు కొనుక్కొనేలా అభివృద్ధి చేయాలన్నారు. బీసీలు ఆయిల్‌పామ్, డ్రాగన్ ఫ్రూట్, చేపల చెరువు, కోళ్ల పెంపకం, ఆవులు గేదెల పెంపకంపై రైతు వేదికల వద్ద అవగాహన క ల్పిస్తామని తెలిపారు. బ్యాంకర్లతో మీటింగులు ఏర్పాటు చేపి రుణాలు ఇప్పిస్తామన్నారు. యంగ్‌ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా కులవృత్తుల మాడిఫికేషన్ ట్రైనింగ్ ఇచ్చి, మారుతున్న కాలానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రా జెక్టు పనుల్లో జాప్యం జరిగిందని, వేగంగా పూర్తిచేస్తామన్నారు. డబుల్ రోడ్డు పూర్తయిన తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ కింద ఇరువైపులా మొ క్కలు నాటుతామని చెప్పారు. త్వరలోనే టామ్‌కామ్ ద్వారా విదేశీ ఉ ద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ ఇన్చార్జి పూజల హరికృష్ణ, నాయకులు శం కర్ రాథోడ్, రాష్ట్ర మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్, సిద్దిపేట ఫిషరీస్ అధికారులు, ఈఎన్సీ, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లిం గమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.