సిద్దిపేటరూరల్,డిసెంబర్ 5: సిద్దిపేట రూరల్ మండలంలోని పెద్దలింగారెడ్డిలో ఆదివారం రాత్రి సుమారు 20 మంది రైతులకు చెందిన మోటార్ల వైరును ఎత్తుకెళ్లిన నిందితులను త్వరగా పట్టుకొని న్యాయం చేయాలని వైద్యారోగ్యశాఖ మం త్రి హరీశ్‌రావు పోలీసులను ఆదేశించారు. సోమవారం బాధిత రైతులంతా మంత్రిని కలిసి వారి గోడు వెల్లబోసుకున్నారు. వ్యవసాయ బావులు, బోర్ల మోటార్ల వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని రైతు లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి అక్కడే ఉన్న ఏసీపీ దేవారెడ్డిని పిలిచి నిందితులను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మంత్రిని కలిసిన వారిలో పెద్దలింగారెడ్డి, రైతులు, నాయకులు ఉన్నారు.
మంత్రిని కలిసిన ఫార్మాసిస్టులు
సిద్దిపేట టౌన్, డిసెంబర్ 5: పల్లె, బసీ దవాఖానల్లో ఫార్మాసిస్ట్ పోస్టులను మంజురు చేయాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును ఫార్మాసిస్ట్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సిద్దిపేటలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ప్రసాద్, రాజేశ్, గౌసి, శ్రీవిద్య, ప్రవీణ్, రజిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని కోరామన్నారు. ఫార్మాసిస్టులకు పదోన్నతులు కల్పించాలని విన్నవించగా మంత్రి సానుకూలంగా స్పందించారని సంతోషం వ్యక్తం చేశారు.