వట్పల్లి, నవంబర్ 7: నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రానర్సింహ భరోసా ఇచ్చారు. గురువారం వట్పల్లి మండలంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వట్పల్లి అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్‌తో పనిచేస్తున్నట్లు తెలిపారు. తాను మార్కెటింగ్‌శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వట్పల్లి మార్కెట్ యార్డును అధునాతన వసతులతో ఏర్పాటు చేశానన్నారు.
నియోజకవర్గంలో రూ. 152 కోట్లతో త్వరలో రోడ్ల మరమ్మతులు చేపడతామని చెప్పారు. వట్పల్లిలో పోలీస్ స్టేషన్ భవ నం, మండల పరిషత్, తహసీల్ కార్యాలయాల ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. వట్పల్లిలో విద్యాభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు. వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ శేషారెడ్డి, వైస్ చైర్మన్ ఈశ్వ ర్, పాలక వర్గ సభ్యులకు మంత్రి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఆర్డీవో పాండు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షడు రమేశ్ జోషి, మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు రాంరెడ్డి, సంగమేశ్వర్, నాయకులు పాల్గ్గొన్నారు.
అందోల్, నవంబర్ 7: అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో త్వరలో ప్రారంభం కానున్న నర్సిం గ్ కళాశాల, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం వైద్యారోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సిం హ పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఆర్డీవో పాండు, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్ రేఖాప్రవీణ్ తదితరులు ఉన్నారు.