రాయికోడ్, అక్టోబర్ 9 : నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, రైతులకు సర్కారు అన్నివిధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం రాయికోడ్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయ న హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…పదేండ్ల తర్వాత మన కార్యకర్తలకు పదవులు రావడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి రూ.3 కోట్లతో గోదాం నిర్మాణం చేపడతామని తెలిపారు. జిల్లాస్థాయి పదవుల్లో మన పార్టీ నాయకులు ఉంటే పనులు త్వరగా అవుతాయన్నారు.
సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అం జయ్య, రాయికోడ్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, సంగారెడ్డి ఆర్డీవో రాజు, జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్, రాయికోడ్ ఏఎంసీ కార్యదర్శి రవికుమార్, నాయకులు బాబుపాటిల్, రాజుదొర, మాజీ జడ్పీటీసీ మల్లిఖార్జున్ పాటిల్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సిద్దన్న పాటిల్, బస్వరాజు పాటిల్, కేదార్నాథ్ పాటిల్, రాజుగౌడ్, ఏఎంసీ పాలకవర్గ సభ్యులు తదితరులుల పాల్గొన్నారు.