మెదక్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా రైతుల నుం చి పక్కాగా సేకరించాలని అధికార యంత్రాంగాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గురువారం మెదక్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేం ద్రాలు సమర్థవంతంగా నిర్వహించి రైతులకు సకా లంలో డబ్బులు చెల్లించాలన్నారు.
క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేకరణ లక్ష్యం మేరకు పూర్తిచేయాలననారు. రుణమాఫీ కాని రైతు ల వివరాలతో సమగ్ర నివేదిక తయారు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవిందును మంత్రి ఆదేశించారు. మారెటిం గ్ శాఖ ద్వారా పత్తి కొనుగోలు చేయాలన్నారు. కొత్త ఆరోగ్య ఉప కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సమీక్షలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.