Milk Van | రామాయంపేట, మార్చి 23 : అదుపుతప్పి ఓ పాల వాహనం డ్రైనేజీలో పడిపోయిన సంఘటన ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీపై పైకప్పు లేకపోవడంతో తరచూ అదే ప్రాంతంలో వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయని గ్రామస్తులు తెలిపారు.
సిద్దిపేట నుండి మెదక్ జిల్లా కేంద్రానికి పాలతో వస్తున్న వ్యాన్ డ్రైనేజీలో పడిపోవడంతో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. దీంతో వ్యాన్‌లో పాలన్నీ డ్రైనేజీలోనే పడిపోయాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా.. వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని దవాఖానకు తరలించారు.
ఈ రోడ్డు నిర్మించిన సదరు కాంట్రాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీలపై పైకప్పులను వేయాలని తెలిపారు. గతంలో కూడా ఇక్కడ ద్విచక్ర వాహనదారులు పడి తీవ్ర గాయాలు అయ్యాయని గ్రామస్తులు గోడు వెల్లబోసుకున్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు